హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

GDWL: అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారిని, బాల బ్రహ్మేశ్వర స్వామిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు ఇవాళ దర్శించుకున్నారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా వారు ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు వారికి ఆశీర్వదించి స్వాగతం పలికారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.