హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు నాలుగో పతకం

ఆసియా క్రీడల్లో భారత్‌ నాలుగో పతకం సాధించింది. మహిళల ట్రెడిషనల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో సుచికా తరియల్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది. సెమీఫైనల్‌లో సింగపూర్‌ క్రీడాకారిణి హుయ్‌హున్‌టెయో చేతిలో ఓడిన ఆమె కాంస్యంతో సరిపెట్టుకుంది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.