GNTR: ఎల్‌నినో కారణంగా గుంటూరు జిల్లాలో ఈ సీజన్‌లో 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. తుళ్లూరు, కాకుమాను తదితర మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. పెదకాకాని మండలంలో మాత్రం 20 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. వానలు సరిగా పడకపోయినా రైతులు రాత్రి పూట కాల్వ నీటిపై ఆధారపడి పంటలు వేస్తున్నారు. దీంతో జిల్లాలో 84 శాతం సాధారణ సాగు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు జిల్లాలో 28 శాతం లోటు వానలు


