హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా ‘దసరా’ రాట పూజ..!

W.G: జంగారెడ్డిగూడెం వాసవి మాత ఆలయంలో రాబోయే దసరా ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం శాస్త్రోక్తంగా రాట పూజ నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ తారకం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు జరిగాయి. దసరా ఉత్సవాల తొమ్మిది రోజులు పాటు ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.