కృష్ణా: మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ఆదివారం ఒక్కరోజే వివిధ సేవల టిక్కెట్ల ద్వారా రూ. 6,50,424 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు, ఏర్పాట్లు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మోపిదేవి ఆలయ ఆదాయ వివరాలు..!


