హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంచికచర్లలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

NTR: కంచికచర్ల స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేస్తే ప్రాధాన్యక్రమంలో పరిష్కరిస్తామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.