హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యాప్తంగా "ఆపరేషన్ నైట్ సేఫ్టీ"

ATP: జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయంగా "ఆపరేషన్ నైట్ సేఫ్టీ" నిర్వహించారు. ఎస్పీ జగదీష్ ఆదేశాలతో రాత్రివేళ సరిహద్దులు, ప్రధాన జంక్షన్లలో తనిఖీలు చేపట్టారు. అనుమానితులు, పాత నేరస్తులను విచారించగా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదయ్యాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.