హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం

KMM: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.