VZM: బొబ్బిలి మండలం చింతాడ నుంచి గొంగాడవలస గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా గోతులమయంగా మారింది. దీంతో చింతాడ, గొంగాడవలస, రెడ్డియ్యవలస గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతుల కారణంగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రహదారికి మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గోతులమయమైన రహదారి.. ప్రయాణికుల అవస్థలు


