TPT: చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ పరిసరాల్లో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు రాత్రి మైలవాండ్లపల్లి సమీపంలోని పొలంలోకి ప్రవేశించింది. వంగుమల్లివారిపల్లెకు చెందిన రైతు బి. కృష్ణయ్య సాగు చేసిన వేరుశనగ పంటను ధ్వంసం చేసి కాయలను తినివేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తినేయడంతో నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నగొట్టిగల్లులో వేరుశనగ పంట ధ్వంసం


