హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్‌టీ నగర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం

PLD: నరసరావుపేట మండలం, ఎల్‌టీ నగర్ వెంచర్‌లోని ఇళ్ల వద్ద వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఆదివారం రాత్రి గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో స్థానిక మహిళలు, యువతులు భక్తిశ్రద్ధలతో దాండియా, కోలాట నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆధ్యాత్మిక పాటల నడుమ నృత్యాలు చేస్తూ, గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు.