MBNR: బడంగ్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో అక్టోబర్ 9న నిర్వహించనున్న 'బహుజన రాజాధికార సమరభేరి' బహిరంగ సభను విజయవంతం చేయాలని BSP నాయకులు పిలుపునిచ్చారు. జడ్చర్ల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో సభ ప్రచారం నిర్వహించారు. ఇన్‌ఛార్జ్ సుధాకర్, Ph,D స్కాలర్ పండరినాథ్ నాయక్, ఉపాధ్యక్షుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'బహుజన సభను విజయవంతం చేయాలి'


