TG: భద్రాద్రి కొత్తగూడెం(D) జూలూరుపాడు(M) వినోభానగర్‌లో విషాదం నెలకొంది. గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ కుమార్తె తన్విశ్రీ(4) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ, అక్కడే నిలిపి ఉంచిన కారులోకి వెళ్లింది. కారు డోర్లు వాటంతట అవే లాక్ కావడంతో చిన్నారి లోపలే చిక్కుకుపోయింది. పాప కనిపించకపోవడంతో కారులో పరిశీలించగా అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మరణించింది.
వార్తలు
పార్క్ చేసిన కారులో ఊపిరాడక బాలిక మృతి


