అన్నమయ్య: రాయచోటి చెన్నముక్కపల్లిలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 35 మందికి పరీక్షలు నిర్వహించి,అర్హులైన 12 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు.గతంలో ఆపరేషన్ చేయించుకున్న 25 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. అనంతరం దాత గోవర్ధన్ రెడ్డి ఆర్థిక సహకారంతో రోగులు, సహాయకులకు అన్నదానం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కంటి రోగులకు ఉచిత ఆపరేషన్లు..!


