హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల జడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్

BPT: ఈనెల 25 నుంచి బాపట్ల జిల్లా పరిషత్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. పట్టణంలోని తూర్పు సత్రం వద్ద గల టీటీడీ కల్యాణ మండపంలో తాత్కాలిక కార్యాలయాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటవుతున్న జడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్‌ను నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.