ప్రకాశం: పామూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలీస్ ప్రజా వేదిక నిర్వహించనున్నట్లు సీఐ దుర్గాశి వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పామూరులో నేడు పోలీస్ ప్రజా వేదిక


