హైదరాబాద్: 28°C
తెలంగాణ

చొప్పదండి ఎమ్మెల్యేను కలిసిన బొప్పాపూర్ గ్రామస్తులు

KNR: కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామస్తులు ఆదివారం కరీంనగర్లో కలిశారు. తమ గ్రామ సమస్యలను విన్నవించారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సహకరిస్తానని హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.