హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి

SRD: అశోక్‌నగర్‌లోని డీఎస్ గ్రాండ్ హోటల్ సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మయూరినగర్‌కు చెందిన బిక్కుమల్లా సత్యనారాయణ (61) వాకింగ్‌కు వెళ్లగా, ఎన్‌ఎస్-65 సర్వీస్ రోడ్డుపై రివర్స్‌లో వస్తున్న లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి కుమారుడు రాకేష్ ఫిర్యాదుతో ఆర్‌సీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.