ప్రకాశం: త్రిపురాంతకం(M) ధూపాడు, మేడేపి స్వర్ణ గ్రామ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ విజయసునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, భూసర్వేలు, పెన్షన్ పంపిణీపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ధూపాడు, మేడేపి గ్రామ కార్యాలయాల తనిఖీ


