హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

NTR: పెనుగంచిప్రోలులో స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నేడు ఉదయం 10 గంటలకు ఎంపీపీ మార్కపుడి గాంధీ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి. శ్రీను తెలిపారు. ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులు ఈ సమావేశానికి తప్పకుండా హాజరై, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జరిగే చర్చల్లో పాల్గొనాలని కోరారు.