హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ మానేరు రిజర్వాయర్‌లో పెరుగుతున్న నీటిమట్టం

SRCL: బోయినపల్లి మండలం మాన్వాడలోని మిడ్ మానేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 316.10 మీటర్లకు చేరగా, 22.875 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌కు 2,890 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 170 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసే ఉన్నాయి.