MDCL: గౌతంనగర్ కూడలి సమీపంలో చెత్త నిల్వలు పేరుకుపోయాయి. రోజుల తరబడి చెత్తను తరలించకపోవడంతో పరిసరాల్లో దుర్వాసన వ్యాపించి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తకుప్పలతో పారిశుధ్యం లోపించడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించాలని కోరుతున్నారు.
తెలంగాణ
చెత్తకుప్పలు.. దుర్వాసనతో ఇబ్బందులు


