SKLM: శ్రీకాకుళం రిమ్స్ వద్ద (రేపు) మంగళవారం 'సేవా సంకల్ప అభియాన్' లో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు DMHO డా. ఇ.ఎన్.వి. నరేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గర్భిణులకు ప్రత్యేక వైద్య పరీక్షలు, గర్భస్థ శిశు సంరక్షణ, వ్యాధి నిరోధకతపై ఉచిత సేవలు అందిస్తామన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు రిమ్స్ వద్ద మెగా వైద్య శిబిరం: DMHO


