హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

నిర్మల్: తానూర్ మండల కేంద్రంలోని వాగ్దేవి విద్యానీకేతన్ హైస్కూల్ ఉపాధ్యాయుడు రాజన్నకు ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈ సందర్బంగా పాఠశాలలలో ఆయనను యాజమాన్యం ప్రత్యేక అభినందనలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.