హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జమ్మలమడుగులో పవిత్రోత్సవాలు ప్రారంభం

KDP: జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, అంకురార్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని ప్రధాన అర్చకులు శ్రీనాథస్వామి తెలిపారు.