హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 24 నుంచి క్రీడా పోటీలు

ASR: పాడేరులో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 1 వరకు స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో భానుమూర్తిరాజు తెలిపారు. అండర్-14, 17 విభాగాల్లో బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్ పోటీలు జరుగుతాయన్నారు. 28, 30 తేదీల్లో నియోజకవర్గ, అక్టోబర్ 1న జిల్లాస్థాయి పోటీలు ఉంటాయని, ప్రతిభ చూపిన వారు రాష్ట్రస్థాయికి ఎంపికవుతారని పేర్కొన్నారు.