హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ వర్షానికి నేలకొరిగిన వృక్షం

JGL: మెట్‌పల్లి మండలం వెల్లుల్ల నుంచి మెట్‌పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి చెట్టు నేలకొరిగింది. దీంతో ఆ మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి కూలిన చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.