హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు డయల్ యువర్ సీఎండీ

విశాఖలోని APEPDCL కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 'డయల్ యువర్ సీఎండీ' కార్యక్రమం నిర్వహించనున్నారు. సంస్థ పరిధిలోని వినియోగదారులు విద్యుత్ అంతరాయాలు, వోల్టేజీ లోపాలు, కొత్త కనెక్షన్ల జాప్యం, ట్రాన్స్ ఫార్మర్ల మార్పిడి తదితర సమస్యలను నేరుగా 86884 00499 నంబర్‌కు ఫోన్ చేసి సీఎండీ దృష్టికి తీసుకెళ్లవచ్చు.