MNCL: కాసిపేట్ మండలం పెద్దాపూర్ పొడుగూడెంలో ఈనెల 19న అగ్నిప్రమాదానికి గురైన టేకం గంగు (50) చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు SI గంగారాం తెలిపారు. మృతుడు మూడు రోజుల క్రితం ఇంటి సమీపంలో చలిమంట పెట్టుకొని మంటల్లో పడిపోయాడు. మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
తెలంగాణ
అగ్నిప్రమాదానికి గురైన వ్యక్తి మృతి


