MHBD: బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఆదివారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు SI రవికుమార్ తెలిపారు. కోదాడకు చెందిన ఎస్కే ఘాజీ పాషా ఆటోలో పండ్లు విక్రయిస్తూ దంతాలపల్లి మండలంలోని ఓ గ్రామానికి వెళ్లాడు. పండ్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
తెలంగాణ
పండ్ల వ్యాపారిపై పోక్సో కేసు నమోదు


