హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదుపుతప్పిన ట్రాక్టర్..తప్పిన ముప్పు

MLG: వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివారం ప్రమాదం తప్పింది. మల్చింగ్, డ్రిప్ సామగ్రి తీసుకెళ్లేందుకు వచ్చిన ట్రాక్టర్‌ను వెనక్కి మళ్లిస్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ట్రాలీ కింద ఇరుక్కున్న ఓ వాహనాన్ని పొక్లెయిన్‌తో బయటకు తీశారు.