MDK: కుటుంబ కలహాలతో మల్లంపేటలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోరబోయిన సాయిలు (41) శనివారం మద్యం తాగి రాగా భార్య నాగరాణి నిలదీసింది. దీంతో గొడవపడి బయటకు వెళ్లిన సాయిలు నర్సాద్రి కుంట వద్ద ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య


