JN: సైబర్ నేరానికి పాల్పడి రూ.20 వేలు కాజేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రామన్నగూడెంకు చెందిన కిరాణా వ్యాపారి భాస్కర్‌రెడ్డికి లింక్ పంపి, దాన్ని ఓపెన్ చేయగానే డబ్బులు అపహరించాడు. దర్యాప్తులో నిందితుడిని ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా కాజీపేట మండలం సుంకేసులకు చెందిన గంగిరెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
సైబర్ నిందితుడి అరెస్టు


