VSP: భీమిలి తాగునీటి సమస్య పరిష్కారానికి తాటిపూడి నీటిని అందించేలా శాశ్వత ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థ బలోపేతానికి రూ.1,845 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. నిర్ణీత రుసుం చెల్లించే అపార్ట్మెంట్‌లకు బల్క్ కనెక్షన్లు ఇస్తామని,సుదూర ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
భీమిలికి తాటిపూడి నీరు: ఎమ్మెల్యే గంటా


