HNK: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాజీపేట డీజిల్ కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. శ్రీశివసాయి కళాక్షేత్రం దేవులపల్లి శ్రీవిద్య బృందం ప్రదర్శించిన నృత్యం భక్తులను ఆకట్టుకుంది. సంప్రదాయ, సాంస్కృతిక కళలకు ప్రాధాన్యమిస్తూ ప్రతిరోజూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
కనులారవిందంగా కూచిపూడి నృత్యం


