హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనం వాయుగుండంగా మారడంతో 23 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కుప్పంలో 112.2 మి.మీ. కురవగా, పెనుమూరులో 87, గుడుపల్లిలో 77.2, తవణంపల్లిలో 61.2, గంగాధరనెల్లూరులో 59, ఐరాలలో 52.2, పులిచెర్లలో 25.4 మి.మీ వర్షం కురిసింది.