NLG: కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల గ్రామ శివారులో చెరువు కట్టపై ఆదివారం పేకాట ఆడుతున్న 8 మందిని టాస్క్‌ఫోర్స్, కట్టంగూర్ పోలీసులు పట్టుకున్నారు. మరో నలుగురు పరారైనట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. వారి నుంచి రూ.5,610 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై దాడి.. 8 మంది అరెస్ట్!


