హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బెజ్జూర్‌లో వీధి దీపాలు లేక ఇబ్బందులు'

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో వీధి దీపాలు లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ చీకటిలో నడిచేందుకు భయంగా ఉందని వార్డు సభ్యులు తెలిపారు. చిన్నారులు, మహిళలు బయటకు రావడానికి జంకుతున్నారని చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలను చీకట్లోనే నిర్వహించాల్సి వస్తోందని కాలనీవాసులు వాపోయారు. అధికారులు స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.