JN: స్టేషన్‌ఘన్‌పూర్ శివారులో ఆదివారం గుర్తుతెలియని యువతి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎదురుగా వెళ్లడంతో ఈ ఘటన జరిగినట్లు కాజీపేట జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతురాలి వయసు సుమారు 25 ఏళ్లు ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్ తెలిపారు.
తెలంగాణ
రైలు కిందపడి యువతి ఆత్మహత్య


