KMR: బీర్కూర్‌లోని ఓ సంఘం భవనంపై ఆదివారం జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. ఈ మేరకు ఏడుగురు జూదరులను పట్టుకుని వారి నుంచి రూ.16,370 నగదు, ఐదు చరవాణులను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు. అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురి అరెస్టు


