హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణ సమీపంలో ఉన్న బైపాస్ రోడ్డును ఆదివారం రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం బైపాస్ రోడ్డు పనులు పూర్తి అయితే పట్టణంలో ట్రాఫిక్ లేకుండా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.