హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో రైతు మృతి!

BHNG: వేములకొండలో రైతు ఐలయ్య(41) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం బావి వద్ద మోటర్‌కు కరెంట్ రావడం లేదని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏబీ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.