హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మండల సర్వసభ్య సమావేశం

KDP: బ్రహ్మంగారిమఠం స్థానిక MPDO కార్యాలయంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO రామచంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన సమాచారంతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు.