హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాల్లో డీజేలపై నిషేధం: ఎస్పీ

SRPT: గణేశ్ నిమర్జనం వేడుకల్లో డీజేల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పరిమితికి మించిన డీజే శబ్దాల వల్ల రక్తపోటు, గుండెపోటు వచ్చి మరణాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు.