హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఎన్నంటే..!

కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం ఆహ్వానించిన దరఖాస్తులకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా 44,058 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో తాడిగడపలో అత్యధికంగా 3,167, బాపులపాడులో 2,646, మచిలీపట్నం అర్బన్‌లో 2,628 దరఖాస్తులు నమోదయ్యాయి. అత్యల్పంగా పెడన అర్బన్‌లో 717, గుడివాడ అర్బన్‌లో 768, గుడ్లవల్లేరు మండలంలో 778 దరఖాస్తులు వచ్చాయి.