ADB: వినాయక నిమజ్జనం పురస్కరించుకొని జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈనెల 21 సాయంత్రం 6 గంటల నుంచి 23 తేదీ సాయంత్రం 6 గంటల వరకు బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు పూర్తిగా బంద్ ఉంటాయని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
తెలంగాణ
జిల్లాలో మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్: కలెక్టర్


