SDPT: దుబ్బాక గణేష్ ఉత్సవాల్లో డీజేలకు ముందస్తు అనుమతి తప్పనిసరని ఎస్సై కీర్తిరాజు తెలిపారు. అనుమతి పత్రాల కోసం ఆన్‌లైన్ విధానాన్ని వినియోగించుకోవాలని కోరారు. పరిమితికి మించి అధిక శబ్దంతో డీజేలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవడానికి భక్తులు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్సై


