హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: గన్నవరం సెక్షన్ పరిధిలో లైన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా నేడు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీ సీపీడీసీఎల్ గుణదల ఈఈ డి. విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడి ప్రాంతాలతో పాటు పలు కాలనీల్లో కరెంట్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.