హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహనీయుల విగ్రహాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దు'

WNP: వీపనగండ్ల మండలంలో మహనీయుల విగ్రహాలకు అడ్డుగా బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఎస్సై నరేష్‌కు వినతిపత్రం అందించారు. సమస్యలపై సమన్వయంతో ముందుకు రావాలని ఎస్సై సూచించారు. మహనీయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, విగ్రహాలకు ఇబ్బంది కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.