JGL: రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బుగ్గారం మండలం శేకల్లలో 56 మందికి రూ.15.54 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. అభివృద్ధి పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి తెలిపారు.
తెలంగాణ
రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోంది: మంత్రి


